వరవరరావు
పెండ్యాల వరవర రావు అందరికీ వి.వి గా సుపరిచితులు. ఆయన నవంబర్ 3,1940 లో వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్ లోని సీ.కే.ఎం కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసారు. వరవర అంటే శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించారు.జనవరి 1970 లో తోటి కవులతో స్థాపించిన తిరగబడు కవులు కొన్నాల్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4 న విప్లవ రచయితల సంఘం …